అగ్నికులక్షత్రియ ఐక్య వెదిక – హైదేరాబద్

మొట్టమొదటి సరిగా ఒక వ్యక్తి/సంఘం/ ప్రాంతం కాకుండా ఒక వ్యవస్థ ఆదారంగా నిర్వహించబడిన అగ్నికులక్షత్రియ ఐక్యవెధిక కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు.

అసలు కార్యక్రమం మొదలు పెట్టటానికి ముఖ్యఉద్దేశం. మన వాళ్ళు చాలా మంది అన్ని రంగాలలో ఉన్నారు. జాబ్స్ ఇవ్వగలిగిన వారు, జాబ్స్ కావలసిన వారు, అది సాఫ్ట్‌వేర్ ఐన, కోర్ సైడ్ ఐన, ఫార్మా ఐన, ఎలెక్ట్రికల్ ఐన, అకౌంటింగ్ ఐన మొదలుగునవి.

వివిద రకాల వ్యాపారం మరియు సర్విస్ లు చేసే వాళ్ళు, ఆ సర్విస్ లు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, కావలసినవారు ఆది ఒక డాక్టర్ ఐన, లాయర్ ఐన, కన్సల్టెంట్ ఐన, వెల్డీoగ్ వర్క్ ఐన, కార్పంటర్ ఐన, డేలీ లేబర్ ఐన.

అత్యవర సమయాలలో మన వారికి సరిగా రియాక్ట్ అవ్వలేక పోతున్నాం, మన వారికి ఎవరికైన, ఎప్పుడైనా, ఏదైన ఆపద వచ్చినప్పుడు, అన్యాయం జరిగిన్నపుడు ఎంధూకంటే ఎవరు ఎక్కడ ఉన్నారో ఎం చేస్తున్నారో, ఎలా ఉన్నారో, ఏమీ చెయ్యగాలరో తెలియకపోవటం వల్ల.

కావున మన వారికి ఒక వేదిక కావాలి, అది ఒక పర్సన్ కాకుండా ఒక వ్యవస్థ కావాలి, ప్రతి వారు ఈక్వల్ గా ఉండాలి, ఎవరితో నైనా కలిసి పని చెయ్యగలగాలి, ఎంత మంది నైనా జత చేర్చుకోవాలి అలా పెంచుకుంటూ ఆంద్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరి గడప తొక్కాలి.

మనం అందరం ఒక్కరికీ ఒక్కరికీ సహాయ పడుతూ మన అగ్నికులక్షత్రియ కుటుంబాన్ని బాగు చేసుకోవాలి. ఇది స్వచందంగా ఒక్కరి వల్ల కాదు, ఒక్కో ఊరికి స్వచందంగా పని చేసే ఒక్కో టీమ్ ఉండాలి, అందుకు ఒక అడుగు పడాలి. ఆ మొదటి అడుగే అగ్నికులక్షత్రియ ఐక్యవెధిక హైదేరాబద్.

ఈ వేదికలో మేము వచ్చిన ప్రతి వారి పూర్తి సమాచారం తీసుకున్నాం, వారు కమ్యూనిటీ నుండి ఏమీ కోరుకుంటున్నారో అడిగాo, కమ్యూనిటీకి ఏమీ చెయ్యగలారో అడిగాం, సలహాలు , సూచనలు అడిగాం, ఈ కార్యక్రమం మీకు నచ్చి, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు జరగాలని భావిస్తే వారు చెయ్యగలిగిన ఆర్ధిక సహాయం అడిగాం.

మేము అనుకున్న దానికంటే మంచి రెస్పాన్స్ వచ్చింది మాకు, మాలో నూతన ఉతేజం కలిగింది. ఇంతలా సపోర్ట్ చేస్తున్న వారికి ఏదైన చెయ్యాలానిపించింది. అంధుకే మళ్లీ అందరం కలిసి నిన్న ప్రతి వారి సలహాలు, సూచనలు, కమ్యూనిటీ నుండి కోరుకుంటున్నావి, ఇవ్వగలిగినవి మొత్తం. స్టడీ చేసిన తరువాత స్వచందంగా అందరం కలిసి పని చెయ్యాలనే ఉత్సాహం వచ్చింది.

మేము మన కమ్యూనిటీ కి ఒక్క టీమ్ ల హైడేరాబద్ నుండి ఈ క్రింది కార్యక్రమాలు చెయ్యాలనుకుంటున్నాం.

1.మన వాళ్ళలో వున్న నిరుద్యోగులకి ఉద్యోగం కలిపించుట కోసం గైడెన్స్ ఇవ్వటం, ఎక్కడఎక్కడ ఏమేమి జాబ్స్ పడుతునయో మన వాళ్ళందరికీ తెలియపరచటం తద్వారా వారికి సహాయం చేసి మన వాళ్ళకి సహాయం చేసేలా తోడ్పడటం.

2. మన వాళ్ల వ్యాపారం మరియు సర్విస్ లని ప్రమోట్ చెయ్యటం తద్వారా వారి అభివ్రుది తోడ్పడుతూ మన వారికి ఉపాది కలిపించేలా ప్రయత్నించటం

3. మన వాళ్లకి ఎప్పుడు, ఎక్కడ, ఎటువంటి సమాచారం ఐన ఉచితంగా అందించుట ఆది జాబ్స్ లో రెఫరెన్సస్ కి ఐన, సమస్యలలో ఉన్న వారికి ఐన , పెళ్ళిలాకైన లేదా మరి ఏదైన తద్వారా మన వారికి ఉపయోగ పడటానికి ప్రయత్నించటం.

4. అన్ని ప్రాంతాలలో ఉన్న సంఘాల వారికి, రాజకీయ నాయకులకి, కుల నాయకులకి అన్ని రకాలుగా తోడ్పడి వారు బలోపేతం అయ్యేలా ప్రయత్నం చెయ్యటం.

5. అత్యవసర కార్యక్రమాలు రక్తదానం మొదలగు కార్యక్రామాల్‌కు వెంటనే స్పందించి వారికి చెయ్యగలిగిన సహాయం చెయ్యటం.

చేసేది మంచి కార్యక్రమం ఐతే సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని వెధికకి వచ్చిన ప్రతి ఒక్కరూ నిరూపించారు, మమల్ని ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహమే మేము ఈ రోజున ఈ కార్యక్రమాలు అన్ని స్వచందంగా ఖాళీగా ఉన్నపుడు ఇంటి నుండి చెయ్యటానికి ప్రోత్సహించింది.

పైన చెప్పబడిన విధముగా మన వాళ్ళకి ఫ్రీ టైమ్ లో సహాయం చెయ్యటానికి మేము సిధంగా ఉన్నాము. అవసరమైన వారు ఎప్పుడు ఏవారికైన మాకు ఫోన్ కానీ మెసేజ్ కానీ పంపవచ్చు.

ఇట్లు హైడేరాబద్ ఆర్గనైసింగ్ టీమ్ :

1. నాగిడి సాంబశివరావు : 9000466522 (Sponsored 5000/-)
2. విశ్వనాధపల్లి రాంబాబు : 9959747373 (Sponsored 4000/-)
3. చింత రాజా : 9603539738 (Sponsored 4000/-)
4. కొప్పనాతి నరసింహ : 8977821341 (Sponsored 4000/-)
5. లంకె గిరి : 9603933990 (Sponsored 3000/-)
6. నాగిడి కృష్ణ : 8977821341 (Sponsored 2000/-)
7. పట్టా రమేశ్ కుమార్ :9963033378 (Sponsored 1000/-)
8. తిరుమాణి కృష్ణం రాజు: 8977384559 (Sponsored 2000/-)
9. బొమ్మిడి సుదిర్ : 8885559559 (Sponsored 1500/-)
10. జల్లా మల్లికార్జున్ : 9160595851 (Sponsored 500/-)
11. చింత కాదర్ బాబు : 9440408040 (Sponsored 1000/-)

ఇప్పటి వరకు ప్రతి మీట్ కి అటెండ్ ఐ ఎల్లపూడు అంధుబాటులో ఉండి యాక్టివ్ గా ఉన్న వారి నంబర్స్ మాత్రమే ఇక్కడ ఇచ్చము . మా లాగే ప్రతి ఒక్కరూ మన కోసం అల్లోచించి గ్రామాలలో ఇంకా అభివ్రుధిలొ వెనకబడి బ్రతుకు పోరాటం చేస్తున్న వారికి మనం ఉన్నాం అనే దైర్యం ఇవ్వటానికి ప్రతి ఒక్కరూ మీ ఫ్రీ టైమ్ ని మన వారికి సహాయం చెయ్యటానికి ఉపయోగించి మన ఆర్గనైసింగ్ టీమ్ లో చేరవలసింధీగా కోరుతున్నాము.

హైదరాబాద్ అగ్నికులక్షత్రియ ఐక్య వేదికకి వచ్చిన విరాళాలు మరియు అయిన ఖర్చుల వివరాలు:

ప్రోగ్రామ్ ఫోటోస్ :